Short Stories

అంతిమ పోరాటం

అంతిమ పోరాటం_The last hour of justice

నిశ్శబ్ద పోరాటం – Part 4

చీకటి దట్టంగా కప్పుకున్నా, రఘు మనసులోని కోపాన్ని ఆపలేకపోయాడు. తన బంగారు తల్లి మీనా కోసం అయిదేళ్లు వెతికి, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అరుణ, తన ఆడబిడ్డను కోల్పోయిన బాధలో మునిగిపోయిన తండ్రిగా అతను నిలిచాడు. కానీ ఇప్పుడు, అతనికి సమాధానం దొరికింది. తన ఊరువాళ్ళు వల్లే తన కూతురు తననుండి దూరం అయింది అని, మీనా ఇంక ప్రాణాలతో లేదు అని తెలుసుకున్నాడు. ఇక వెనుకడుగు వేయలేదు, ఎం ఆలోచించలేదు.

ఆ రాత్రి ఆ సారాయి కొట్టుకి అనుకుని, ఏ గదిలో అయితే వీళ్లంతా ఉన్నారో, అక్కడికి రఘువెళ్లాడు. గది నిండుగా ఉన్నా, అతని కళ్లు కేవలం ఒక్కరినే వెతికాయి—బిశ్వ. రఘు ఒంటరిగా నడిచి వెళ్ళి, బిశ్వను చూస్తూ ఓ కపటనవ్వు నవ్వాడు. బిశ్వ, తాగిన మత్తులో “ఏంట్రా, ఇటువచ్చావు, ఎం పని నీకు ఇక్కడ?” అని అడిగేలోపే, రఘు అతని మెడను బలంగా పట్టుకొని, కిందకు లాక్కొని టేబుల్‌పై గుద్దాడు. ఒక్క క్షణంలో గది నిశ్శబ్దమైంది. రఘు కళ్లు రక్తం మరుగుతున్నట్లు మెరుస్తున్నాయి. “నా బిడ్డని చంపిన కుక్కలు, మీరంతా ఇంకా బ్రతికేఉన్నారా?” అంటూ కేకలు వేస్తూ, అతని నుదిటిపై మళ్లీ మళ్లీ గుద్దాడు.

“మీనా ఎలా చనిపోయిందో చెప్పు!” రఘు గట్టిగా అరుస్తూ అడిగాడు. బిశ్వ ప్రాణభయంతో చేతులు జోడించి, “ఆమెను కిడ్నాప్ చేసిన రోజు… మేము ఒకడికి అమ్మేశాం. అతను మీనా బ్రతికి ఉండగానే, తన రక్తం, గుండె, కళ్ళు, కిడ్నీలూ, ఇంకా కాలేయం తీసేసి శవాన్ని పారేసాడు. శవం ఎవరికైనా దొరికితే ప్రమాదం అని, మేం తన శరీరాన్ని తీసుకెళ్లి, కాలికి రాయ కట్టి, చెరువులో పారేసాం,” అంటూ గడగడలాడిపోయాడు.

రఘు ఒళ్ళంతా తగులుబడినట్లయింది. చిన్నారి మీనా… అంత వేదన అనుభవించిందా? కాళ్ల కింద నేల ఊగినట్లు అనిపించింది. గుండె పగిలిపోతుందనిపించింది. “రఘూ, దయచేసి వదిలేయ్!” అని బిశ్వ గట్టిగా అరుస్తూ, వేడుకున్నాడు. కానీ రఘు వినలేదు. తన చిన్నారి మీనా ఆ రోజున ఏం అనుభవించిందో, అదే మృత్యువును అతనికి చూపించాలి అనుకున్నాడు. అతని పిడికిళ్లు ఇనుపకడ్డీల్లా మారాయి. టేబుల్‌పై ఉన్న గాజు బాటిల్‌ను పగులగొట్టి, బిశ్వ గొంతులో దూర్చేసాడు. బిశ్వ రక్తం బాటిల్ నుండి ఆ టేబుల్ మొత్తం చిందింది. రఘు కోపం అతనికి స్పృహ లేకుండా చేసింది, ఎం చేస్తున్నాడో తనకే తెలియటం లేదు.

ఇంతలో మిగతావాళ్లు లేచి రఘును ఆపాలని చూశారు. కానీ అతనికి అప్పుడు ప్రాణభయం లేదు. “నా మీనాకి ఎంతటి వేదన ఇచ్చారో, మీరు అంతకు రెట్టింపు అనుభవించాలి!” అంటూ వారిపై పరిగెత్తాడు. ఓంప్రకాశ్ వెనుకకు పారిపోయేలోపే, రఘు అతన్ని నేలకు తోసి, దాడి చేసాడు. ఓంప్రకాశ్ నడుము దగ్గర నుండి తీసుకున్న కత్తిని అతని తొడలో దించాడు. అతని నడుముని తిరగబెట్టి, మళ్లీ మళ్లీ పొట్టలో పొడిచాడు, పొట్ట అంతా జల్లెడలా మారిపోయింది. ఓంప్రకాశ్ కేకలకు గదిలో గోడలు అదిరాయి.

మల్లేశం పరుగు తీసే ప్రయత్నం చేశాడు కానీ రఘు అతనిపై దూకి, అతని మెడను గట్టిగా పట్టుకుని, తన పిడికిలి బలంతో అతని శ్వాస ఆడకుండా విరుచుకుపడ్డాడు. ఒక్కో దెబ్బ వేసినప్పుడల్లా, తన కూతురు బాధను గుర్తుచేసుకుంటూ, బ్రతికి ఉండగా తన శరీరం నుండి ఒక్కో అవయవాన్ని తీస్తున్నప్పుడు మీనా పడ్డ బాధని దృశ్యాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ కొడుతున్నాడు.

“నా బిడ్డకి చివరి క్షణాల్లో భయం ఎలా అనిపించిందో మీరూ తెలుసుకోవాలి!”

రఘు తన చెయ్యి గాయపడిన చోట రక్తాన్ని చూసి, శ్వాస తీసుకుని, ముందుకి వెళ్లేలోపే, బిశ్వ కదిలి, బయటకి పారిపోయి, తన ప్రాణం కాపాడుకోవాలని చూశాడు. కానీ రఘు అతని తల వెనుక భాగాన్ని పట్టుకొని గట్టిగా ద్వారబంధానికి కొట్టాడు. అతని కపాలం అక్కడికక్కడే రెండుముక్కలైంది. ఒక్క క్షణంలో అతను చచ్చిపోయాడు.

తన కూతురి ప్రాణాలను తీసిన వారిని సమాప్తం చేశాననే తృప్తి అతని హృదయంలో ఒకింత నొప్పితో కలిసింది.

రక్తసిక్తమైన తన చేతులు చూసుకుంటూ, ఓ చిరునవ్వుతో, తండ్రిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన గర్వంతో, రఘు అక్కడినుండి బయటకు వచ్చి, తన సైకిల్ వైపుగా అడుగులు వేస్తూ, వెంటనే పోలీసులు దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి, హత్యలు అన్ని తానే చేశాను అని చెప్పి లొంగిపోదాం అనుకుంటూ, ఆకాశం వైపు చూసి, “మీనా… నా బంగారు తల్లీ, నిన్ను వెతికే ప్రయాణం ముగిసింది…” అని గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయి, మీనా లేదు అని ఏడుస్తూ చనిపోయాడు.

ఆ ఊరి కథలో, రఘు ఒక పిచ్చివాడిగా మిగిలిపోయాడు. కానీ మట్టిలో కలిసిపోయిన వాళ్లకు మాత్రం రఘు ఒక యముడు, న్యాయం సాధించిన తండ్రి.

Related posts
Short Stories

భవిష్యత్తు ఎవరిది?

Short Stories

కనిపించని హస్తం

Short Stories

చీకటి గాలి

Short Stories

నిశ్శబ్ద పోరాటం - Part 1

Sign up for our Newsletter and
stay informed