
నిశ్శబ్ద పోరాటం – Part 3
కాలం గడుస్తుంది, ప్రేమించి పెళ్లిచేసుకున్న అరుణాని కోల్పోయిన కూడా రఘు, మీనా కోసం చాలా దృఢంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మీనా కూడా రఘు జీవితంలో లేదు. మీనాని కోల్పోయాక తాగుడికి అలవాటు పడి, చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టు తో, చూసినవాళ్లు ఇతనికి మతిస్థిమితం లేదేమో అని అనుమానించేలా మారిపోయాడు రఘు. రోజు సైకిల్ తొక్కుకుంటూ దగ్గర్లో ఊర్లు, కొండలు, గుట్టలు అన్ని వెతుకుతూ, తనకి కనిపించిన వాళ్ళందర్నీ అడుగుతూ, క్రమం తప్పకుండా, ప్రతి సంతలోనూ తనకి కనిపించిన వాళ్ళందరిని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటె, జనాలు విసుక్కుంటూనే చూడలేదు అని సమాధానం చెప్తున్నారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి.
రఘు ఏ ఊర్లో అయితే మీనని పోగొట్టుకున్నాడో, యే ఇంట్లో ఉండి తన బంగారు తల్లిని గుండెలపై నిద్రపుచ్చేవాడో, అదే ఇంట్లో, అదే ఊరులో ఉండిపోయి, మిగతావాళ్ళల్లానే తాను కూడా, ఆ ఊరివాళ్లలో ఒకడిలా కలిపోయాడు. ఒకరాత్రి ఎప్పటిలానే రఘు తాగడానికి వెళ్ళాడు.
తాను వెళ్లేసరికి ఆ కొట్టు చాలామట్టుకు తన ఊరివాళ్లతో, తనకి బాగా తెలిసినవాళ్లతో నిండిపోయింది. రఘు తనకి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోటానికి సైకిల్ తీస్తూ ఉండగా, చిన్నపిల్లలని ఎత్తుకెళ్లేటప్పుడు, జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఎవరికీ అనుమానం రాకుండా ఎలా చూసుకోవాలి, వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన గుంపులో కొత్తగా చేరిన ఓంప్రకాష్ కి, సుమారు 56 ఏళ్ళు ఉండే బిశ్వ శిక్షణ ఇస్తున్నాడు. ఇలాంటి జాగ్రత్తల్లో భాగంగా ఒక 5 సంవత్సరాలు క్రితం బిశ్వ తమ్ముడయిన బెహూరా చేసిన తప్పువల్ల జరిగిన ప్రమాదం లో ఒక ఒక పాప ఎలా చనిపోయిందో వివరించటం మొదలుపెట్టాడు.
సుమారు 5 సంవత్సరాల క్రితం, స్కూల్ గేటు బయట ఆడుతూ, అనుకోకుండా రోడ్ మీదకి వచ్చినపుడు, తాగిన మత్తులో బెహూరా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నపుడు మీనా తన సైకిల్ ని గుద్దుకుని పడిపోయింది. బెహురా ఉండే ఇంటికి మీనా కాస్త దూరంలోనే ఉండేవాళ్ళు. ఎప్పటినుంచో మీరాని ఎత్తుకెళ్లిపోవాలి అని బెహూరా ముఠావాళ్ళు ఆలోచిస్తున్నారు. కింద పడిపోయిన మీనని పైకి లేపి, పక్కనే ఉన్న రాయిపై కుర్చోపెట్టాడు బెహూరా. తనకి, పిల్లల్లకి ఎలా మంచిమాటలు చెప్పి ఎత్తుకెళ్లిపోవాలో బాగా అనుభవం ఉండటం వల్ల, మీరని తనతో తీసుకెళ్లటం పెద్ద శ్రమ అవ్వలేదు. నువ్వుండేది మా ఇంటికి దగ్గరలోనే కదా, మీ నాన్న ఫలానా గెస్ట్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్నాడు కదా అని అడిగితే మీనా అవును అని సమాధానం చెప్పింది. అయితే నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళటానికే వచ్చాను, మీ నాన్న యీరోజు గెస్ట్ హౌస్ లో పడిపోయాడు, కాలుకి కట్టుకట్టి ఇంట్లో దింపి వస్తున్నాను అని చెప్పేసరికి, మీనా వాళ్ళ నాన్నకి ఏమైందో అని ఏడవటం మొదలు పెట్టింది.
బెహురా తనని ఇంటిదగ్గర దింపేసి, వేరేపని ఉంది నేను వెళ్ళాలి తొందరగా వెళ్దాం అంటే, మీనా అతని సైకిల్ మీద ఎక్కి కూర్చుంది. మీనా స్కూల్ గేట్ నుండి కాస్త ముందుకి వెళ్తే ఒక చిన్న రాతి రోడ్డు మార్గం. అటువైపుగా సైకిల్ తిప్పాడు బెహూరా. మీనా తెలివైన పిల్ల అవ్వటంవల్ల, మనం ఇలా వెళ్తున్నాం ఏంటి, ఇలా వెళ్తే మనం ఇంటికి వెళ్ళం కదా అని అరుస్తూ, బెహూరా ని ప్రశ్నించటంతో, ఆ రోడ్ లో కొంచెం ముందుకువెళ్లి, సడన్గా సైకిల్ ఆపి, మీరని గట్టిగ సైకిల్ కిందకి లాగి, తన సైకిల్ కి ఉన్న తాడుతో మీనని కట్టేసి, ఆకులను గుండ్రంగా చేసి, మీరా అరవకుండా నోట్లో గట్టిగా కుక్కేసాడు. ఆరాత్రి వరకు మీరా ని అక్కడే చెట్టు తొర్రలకి కట్టేసి, మీనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
చీకటి పడ్డాక ఇంకో ఐదుగురు చిన్నపిల్లలని తీసుకుని బెహురా, తన అన్నయిన బిస్వా, మల్లు, బాలాలతో తిరిగి వచ్చాడు. వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే అబ్బాయి, మిగతావాళ్లంతా అమ్మాయిలు, తనకన్నా చిన్నపిల్లలు, వాళ్లంతా కూడా తన ఊరులో పిల్లలే అని మీనా గుర్తించింది. వాళ్లందరికీ కాళ్ళు కట్టేసి, ఒకే తాడుతో చేతులు ముడేసి, వాళ్ళందరిని అక్కడినుండి వేరే చోటుకు తీసుకెళ్లటానికి సిద్ధం చేస్తున్నారు. ఈలోగా మల్లేశం పాతబడ్డ ఒక గూడ్స్ ఆటోని తీసుకుని రావటంతో. ఆటోకి వెనుక, సామాన్లుపెట్టె తొట్టెకి ప్రత్యేకంగా ఒక చిన్న సీక్రెట్ బాక్స్ ని అమర్చారు. దాన్లో పిల్లలందరిని ఇరికించి ఇరికించి పెట్టి, ఆ బాక్స్ ని మళ్ళీ మూసేసారు. బెహురా, మల్లేశం ముందు కూర్చుని, బిస్వా, మల్లు, బాలాలు వెనుక తొట్టెమీద నించుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ బోర్డరు వరకు చేరుకున్నారు.
చివరి భాగం, వచ్చేవారం.