ప్రేమ – ప్రయాణం – ఒక జీవితం
ఉదయపూర్, భారతదేశం లో పురాతన నగరాలలో ఒకటి. అరవాలి పర్వతాలు మరియు థార్ ఎడారికి మధ్యన గంభీరమైన పురాతన కట్టడాలు, మెరిసే సరస్సులతో, గొప్ప సాంస్కృతిక వారసత్వంతో, వెనిస్ అఫ్ ది ఈస్ట్ గా పిలవబడే నగరం, ఉదయపూర్.
భారతదేశం మొత్తంలోనే, అత్యంత అద్భుతమైన పాలస్ గా పిలవబడే, సిటీ పాలస్, ఉదయపూర్ నగరానికి నడిబొడ్డున ఉంది. ఇక్కడినుంచే రాజకుటుంబీకులు దశాబ్దాలుగా నగరాన్ని పాలించేవారు. ప్రస్తుతం, ఉదయపూర్ నగరాన్ని, ప్రజలకి అత్యంత ప్రియమైన, మేధావి మరియు ధర్మాన్ని నాలుగు పాదాలమీద నడిపించే రాజు పాలిస్తున్నారు. ఆయనే, మహారాజా రాజేంద్రసింగ్.
రవి, ఒక మంచి సంగీత విద్వాంసుడు. ఉదయపూర్ యొక్క అందాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అక్కడ ఇక్కడ విని, స్వయంగా చూద్దాం అనే ఉత్సాహంతో, రవి ఒక రోజు ఉదయపూర్ నగరానికి బయలుదేరాడు. రవి తన పాటలు, సంగీతం తో, జనాలని మంత్రముగ్ధుల్ని చేసేవాడు.
రవి, ఉదయపూర్ నగరాన్ని స్వయంగా తానే చూడాలనే ఆశతో ఉదయపూర్ చేరుకొని, నగరాన్ని అంతా చూస్తూ, నగర సౌదర్యానికి, ప్రజలు రంగు రంగుల చీరలు, తల పాగాలు ధరించటం చూసి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. నగర వీధులలో సంచరిస్తునప్పుడు, ప్రతి మూలనుండి వచ్చే సుగంధ ద్రవ్యాల మరియు ఆహార పదార్ధాల సువాసనలకి మైమరిచిపోయాడు.
రవి ఒకానొక బజార్ లో నడుస్తూ ఉండగా, ఒకా తియ్యని గాత్రం, రవి చెవులని తాకింది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ రవి వెళ్లగా, రాజస్థానీ సాంప్రదాయ జానపద పాట పడుతూ, డోలక్ తో ఒక అందమైన రాజస్థానీ అమ్మాయి రవి కంట పడింది.
రవి, ఆమె దగ్గరకి చేరుకొని, ఆమె కళ్ళల్లో చూస్తూ, నేను కూడా మీతో పాట కలపనా అని అడగగా, ఆ రాజస్థానీ అమ్మాయి, సంకోచిస్తూనే, రవి కి ఉన్న, ఆసక్తి ని గమనించి, తనతో కూడా రవి పాడటానికి ఒప్పుకున్నాది.
వీళ్లిద్దరు కలిసి పాడుతుండగా, ఆలా బజారున వెళ్తున్న ప్రజలు, అలాంటి పాటలు, సంగీతాన్ని తాము ఇంతవరకు వినలేదు అని అనుకుంటూ, అక్కడే నిలిచిపోయి, మంత్రముగ్ధులయ్యి పాటలను వింటున్నారు. వీళ్ళ పాటల హడావిడి అయ్యాక, ప్రజలు వాళ్ళని ఎంతగానో మెచ్చుకుని, మీరిద్దరిని ఇంతకుముందు ఇక్కడ మేము ఎప్పుడూ చూసింది లేదు. మీరు ఎవరు, ఎక్కడినుండి వచ్చారు అని కుశల ప్రశ్నలు వేశారు.
సమాధానంగా, వాళ్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని పరిచయం చేసుకున్నారు. మొదటిగా అచ్చమైన రాజస్థానీ అమ్మాయి గా కట్టు బొట్టులతో మెప్పించిన అమ్మాయి, ప్రియా గా తనని తాను పరిచయం చేసుకుంటుంది.