Short Stories

భవిష్యత్తు ఎవరిది?

who-owns-the-future-science fictional telugu story

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, జీవం నీటిలో మొదలై, నెమ్మదిగా భూమిపై పాగా వేసింది. కొన్ని లక్షల యేళ్ళ క్రితం, మానవ మేధస్సు పెరుగుదలలో ప్రధాన మలుపు తిరిగింది. మొదటగా, అతని ఆహారం ప్రధానంగా పండ్లు, వేర్లు, దుంపలు, గింజలు, ఆకుకూరలతోనే పరిమితమైంది, కాలక్రమేణా మనిషి వేటాడే జీవిగా మారి, మాంసాహారం తినడం ప్రారంభించాడు. మాంసం, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల మెదడు అభివృద్ధి చెందడానికి అవసరమైన పుష్కలమైన ఎనర్జీ లభించింది. మెదడు మరింత సంక్లిష్టంగా మారి, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం పెరిగింది. మానవుడు సాధనాలను ఉపయోగించడం ప్రారంభించి, సమూహాల్లో కలిసి జీవించడం ప్రారంభించాడు.

కాలక్రమేణా, మానవుడు మంటను అదుపులో పెట్టుకోవడం తెలుసుకున్నాడు. మంట వంటకోసం, రక్షణ కోసం, వేడిమి కోసం ఉపయోగపడింది. తరువాత వ్యవసాయం ద్వారా, భూమిని సాగుచేసి, తాను కోరుకున్న విధంగా పంటలు పండించగలిగాడు. తద్వారా శాశ్వత నివాసాల నిర్మాణం ప్రారంభమైంది. దీంతో నాగరికతల ఏర్పాటుకు పునాది పడింది. మిసోపోటేమియా, ఈజిప్ట్, హరప్పా నాగరికతలు అభివృద్ధి చెందాయి. భాషా వ్యవస్థలు, లెక్కలు, వైద్యం మొదలైనవి రూపుదిద్దుకున్నాయి.

క్రమంగా మానవుడు రాజ్యాలను ఏర్పాటు చేసుకొని, ఒకరికొకరు పోటీ పడటం ప్రారంభించాడు. చక్రం ఆవిష్కరణతో రవాణా మార్గాలు వేగంగా అభివృద్ధి చెందాయి. అక్షర ముద్రణ పద్ధతితో విజ్ఞానం వేగంగా వ్యాప్తి చెందింది. విద్యుత్, టెలిఫోన్, ఆవిష్కరణల ద్వారా మానవుడు సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. 20వ శతాబ్దంలో కంప్యూటర్, ఇంటర్నెట్ ఆవిర్భావంతో మానవ సంబంధాలు, సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

21వ శతాబ్దంలో మానవుడు మరింత ముందుకు వెళ్లాడు. AI, రోబోటిక్స్, జన్యుపరమైన సాంకేతికత, మెరుగైన ఆరోగ్య సంరక్షణలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు, మానవుడు అంతరిక్షాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అతని నూతన ఆవిష్కరణల్లో ముఖ్యమైనది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీని ద్వారా, మన సౌర వ్యవస్థ వెలుపల కొత్త గ్రహాలను కనుగొన్నాడు. అటువంటి గ్రహాల్లో “సూపర్ ఎర్త్” లాంటి భూమిని పోలిన గ్రహాన్ని కనుగొనడం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

మానవుడు తన తెలివిని ఉపయోగించి ఎంతో అభివృద్ధి, శక్తి సాధించాడు. అదే సమయంలో తన అభివృధ్ధికోసం వనరులు పొందడానికి, గనుల కోసం వేల కోట్ల చెట్లను నరికివేశాడు, అడవులను తగలబెట్టాడు. జల వనరులను దుర్వినియోగం చేశాడు. నీటి కాలుష్యంతో పాటు వాయుకాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద నగరాల్లో శ్వాస కూడా ప్రమాదకరంగా మారింది. యుద్ధాలు, బాంబులు, పరస్పర పోరాటాలు – ప్రకృతిని నాశనం చేసేందుకు కొత్త మార్గాలను కనుగొన్నాడు.

ఈ భూమిమీద కేవలం మనిషిమాత్రమే బుద్ధిజీవిగా మారాడా? మనిషితో పాటు వేరే జీవి కూడా బుద్ధి జీవిగా మారితే? అలాంటి బుద్ధి జీవితో మనిషి కలిసి ఈ భూమిమీద జీవిస్తూ తమకి ఎదురయ్యే సవాళ్ళకు సమాధానాలు కనుక్కుంటారా? లేక ఈ రెండు బుద్ధిజీవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం యుద్దాలు చేస్తారా?

Disclaimer: The featured image illustrating Human Evolution was generated with the assistance of AI.

Related posts
Short Stories

అంతిమ పోరాటం

Short Stories

కనిపించని హస్తం

Short Stories

చీకటి గాలి

Short Stories

నిశ్శబ్ద పోరాటం - Part 1

Sign up for our Newsletter and
stay informed